![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1092 లో..... లక్కీని చూసి రేఖ షాక్ అవుతుంది. లక్కీ వాళ్ళ అమ్మ ఎవరో రేఖ పిన్ని కనుక్కుంటా అని చెప్పింది.. అందుకే లక్కీని ఇక్కడికి తీసుకొని వచ్చానని రాజు అనగానే మీరు నిజంగా మా అమ్మ గురించి కనుక్కుంటానని చెప్పారా చాలా థాంక్స్ అండి ఎన్నో సంవత్సరాలుగా అమ్మ ప్రేమ కోసం చూస్తున్నానని లక్కీ ఎమోషనల్ అవుతాడు.
ఏం చెప్పినా సరే వాడు ఈ ఇంట్లో ఉండడానికి అసలు వీలు లేదని భ్రమరాంబ అంటుంది. మీరు ఒప్పుకునేదేంటి రేఖ పిన్ని ఒప్పుకోవాలి.. చెప్పు పిన్ని నువ్వు వద్దంటే వాడిని ఇప్పుడే పంపించి వాళ్ళ అమ్మని వెతికిపెట్టే బాధ్యత నేను తీసుకుంటానని రాజు అనగానే రేఖ భయంతో సరే ఇక్కడే ఉండమని చెప్పమని రేఖ అంటుంది. మరొకవైపు నందుని ప్రేమిస్తున్నట్లు వెంకీ కన్ఫమ్ చేసుకుంటాడు. ఈ విషయం ఎలాగైనా నందుకి చెప్పాలని వెంకీ అనుకొని బయటకు వస్తాడు. అప్పుడే చలపతి, లక్ష్మీ ఇద్దరు రాజు గురించి మాట్లాడుకుంటారు. ఒరేయ్ నువ్వు ఎవరినైనా ప్రేమించు కానీ ఆ దుగ్గిరాల ఇంటి అమ్మాయిని మాత్రం ప్రేమించకు అలా అని మాటివ్వమని చలపతి అనగానే నందు ఏం ఆ ఇంటికి వారసురాలు కాదు కదా అని వెంకీ మాటిస్తాడు. అప్పుడే నందు వస్తుంది. ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఇందు, లక్కీ, రాజు బయటకు వస్తారు. అసలు మా అమ్మ గురించి రేఖ పిన్నికి ఎలా తెలుసురా అని లక్కీ అడుగుతాడు. అవును ఎలా తెలుసని ఇందు అడుగుతుంది. లక్కీ నువ్వు వెళ్లి ఐశ్వర్యని సెట్ చేసుకోమని రాజ్ అతడిని లోపలికి పంపిస్తాడు. ఇప్పుడు నీకు నిజం తెలియాలి నాకు నీ సపోర్ట్ కావాలని రాజు అంటాడు. లక్కీ కన్నతల్లి ఎవరో కాదు రేఖ పిన్ని అని జరిగింది మొత్తం రాజు చెప్పగానే ఇందు షాక్ అవుతుంది. నాకు నీ సపోర్ట్ కావాలని రాజు అనగానే ఏ సహాయం అయినా చేస్తానని ఇందు అంటుంది.
మరొకవైపు వెంకీ తన లవ్ మ్యాటర్ నందుకి చెప్పాలనుకుంటాడు. అంతలోనే పోలీస్ వాళ్ళ ఇంటి దగ్గర ఆపమని చెప్పి లోపలికి వెళ్తుంది. జస్ట్ మిస్ లేదంటే ప్రపోజ్ చేసేవాడిని అని వెంకీ అనుకుంటాడు. తరువాయి భాగంలో లక్కీని మదన్ రూమ్ లో ఉండమని రాజు చెప్తాడు. దాంతో మదన్ గొడవ పెడతాడు. నా అల్లుడు స్థాయి ఏంటి వాడి స్థాయి ఏంటి అని భ్రమరాంబ అనగానే వాళ్ళు ఇద్దరు అన్నాదమ్ముళ్లు అని రాజు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |